Guntur | నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి.. గుంటూరులో టీడీపీ నేత, కుటుంబసభ్యుల అమానవీయం
Guntur | ఏపీలోని గుంటూరులో టీడీపీ నేత, అతని కుటుంబసభ్యులు దాష్టీకంగా వ్యవహరించారు. నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. ఈ నెల 15వ తేదీన జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Guntur | ఏపీలోని గుంటూరులో టీడీపీ నేత, అతని కుటుంబసభ్యులు దాష్టీకంగా వ్యవహరించారు. నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. ఈ నెల 15వ తేదీన జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణబాబుకాలనీకి చెందిన ఓ మహిళ ఈ నెల 15వ తేదీ రాత్రి తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీటిని పట్టుకుంటున్నారు. ఇది గమనించిన 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబసభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆమె ఇంట్లోకి వెళ్లిపోతుండగా మూర్తి సోదరి, ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. అనంతరం అందరూ కలిసి ఆమె వెంటపడి దుస్తులు చింపేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు.
నడిరోడ్డుపై వివస్త్రగానే ఉంచి దౌర్జన్యానికి దిగారు. అయితే స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ నెల 16వ తేదీన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మూర్తి, అతని సోదరి సహా 9మందిపై కేసు నమోదు చేశారు. వారిని పోలీసులు అదుపుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటన అనంతరం టీడీపీ కార్యదర్శి మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

