ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ అరెస్ట్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ అరెస్ట్ కక్షపూరితమని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో విఫలమైందని, అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోందని విమర్శించారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే నారాయణను అరెస్ట్ చేశారని ఆరోపించారు.
నారాయణ అరెస్ట్‌ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే దోషిగా చూపే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మాస్ కాపీయింగ్‌కు, పరీక్ష నిర్వహణ వైఫల్యాలకు నారాయణను ఎలా బాధ్యుడ్ని చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.