TataNagar Express | వైజాగ్ సమీపంలో టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. పెందుర్తి రైల్వే స్టేషన్ దగ్గరలో విద్యుత్ లైన్ పనులు జరుగుతుండటంతో కరెంట్ పోల్ పక్కకు ఒరిగి.. రైల్వే ఓవర్‌హెడ్ ఎక్విప్మెంట్ విద్యుత్ వైర్లపై పడిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలట్ అప్రమత్తమై సకాలంలో ట్రైన్‌ను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
విద్యుత్ వైర్లపై స్తంభం పడటంతో ముగ్గురు రైల్వే ఉద్యోగులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన కారణంగా దాదాపు గంటపాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అలాగే సాంకేతిక నిపుణులు ఆ మార్గంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు.
టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం
విశాఖ-పెందుర్తిలో రైల్వే పనులు జరుగుతుండగా పక్కకు ఒరిగిన విద్యుత్ స్థంభం
రైల్వే ఓహెచ్ఈ విద్యుత్ తీగలపై స్తంభం పడటంతో ముగ్గురికి గాయాలు
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు.. ఒకరి పరిస్థితి విషమం
అదే సమయంలో అటుగా వెళ్తున్న టాటానగర్… pic.twitter.com/d7earhsFFj
— Vizag News Man (@VizagNewsman) November 19, 2025