Srisailam | ‘స్వచ్చ శ్రీశైలం’ కార్యక్రమంలో భాగంగా క్షేత్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి భాద్యత అని దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఉదయం గంగాధర మండపం నుండి నందిమండపం వరకు ఈఓ, అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ శ్రీశైలం’ ప్లకార్డులు, బ్యానర్లతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్య స్వచ్చసేవ కార్యక్రమం చేపట్టారు.
శ్రీశైల క్షేత్రాన్నిఆరు జోన్లుగా, 11 సెక్టార్లుగా విభజించి శిఖరం, పాలధార పంచధార, టోల్ గేట్ మొదలు పాతాళగంగ వరకు ఆలయ అధికారులు సిబ్బందితోపాటు శివసేవకులు కలిసి 66 నిర్ణీత ప్రదేశాలలో ఒకేసారి పారిశుధ్య చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, డిప్యూటీ ఈవో రమణమ్మ, ఈఈ నర్సింహ్మరెడ్డి, ఏఈవోలు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివ సేవకులు, యాత్రికులు కూడా స్వచ్చందంగా పాల్గొన్నారు.