KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీడియాలో ప్రచారం కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీలోని మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించాలని ఇటీవల చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కాకుండా జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సోమవారం నాడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. కేవలం మీడియాలో ప్రచారం కోసమే తరచూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని మండిపడింది.