అమరావతి : నూతన సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చు కోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Draupadi Murmu) సూచించారు. అనంతపురం ( Anantapuram ) లోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ వర్సిటీకీ మంచి గుర్తింపు ఉందన్నారు. వర్సిటీలో కష్టపడ్డ విధంగానే భవిష్యత్‌లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు.
సవాళ్లను అధిగమించేలా ప్రణాళికులు రూపొందించుకోవాలని సూచించారు. కొత్త ఆలోచనలతో నూతన సాంకేతికతకు నాంది పలకాలని కోరారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఎడ్యుకేషనల్ హబ్‌గా ఎదుగుతోందని అన్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు పాల్గొన్నారు.