అమరావతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న శ్రీవారిని 54,396 మంది భక్తులు దర్శించుకోగా
29,344 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకుల ద్వారా టీటీడీకి హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
పదకవితా పితామహులు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులవారి 519వ వర్ధంతి సందర్భంగా మహతి కళాక్షేత్రంలో ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఎస్. ఉషారాణి కూచిపూడి నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి సుప్రభాతం మొదలుకొని, తోమాల, అర్చన, ఏకాంత సేవ, బ్రహ్మోత్సవాలతో పాటు స్వామివారి వైభవాన్ని కీర్తించిన పలు అన్నమయ్య కీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి.