అమరావతి : తిరుమలలో నిన్న శ్రీవారిని 23,744 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 12,017 మంది తలనీలాలు సమర్పించుకోగా కానుకల రూపేణా హుండీ ఆదాయం రూ. 2. 50కోట్లు వచ్చిందని వివరించారు. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు మైక్‌ల ద్వారా భక్తులకు వివరిస్తున్నారు. ఈ రోజు ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికి జస్టిస్ చే పూజలు చేయించారు.