Srisailam | శ్రీశైలంలోని కొత్తపేట వాసి డీ పుల్లయ్య మంగళవారం శ్రీశైల దేవస్థానంలోని వీరభద్రస్వామికి 800 గ్రాముల బరువు గల ఆకుపచ్చ రాయితో కూడిన వెండి కిరీటం, 290 గ్రాముల వెండి పళ్లెం అందజేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాత పుల్లయ్య వీటిని అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు ఎం ఉమానాగేశ్వర శాస్త్రి, పర్యవేక్షకులు కే అయ్యప్ప, గుమస్తా సావిత్రికి కిరీటం, పళ్లెం సమర్పించారు. తర్వాత దాత డీ పుల్లయ్యకు వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామి అమ్మవార్ల శేష వస్త్రం, ప్రసాదాలు అందజేశారు.
హైదరాబాద్ నగరానికి చెందిన టీ విజయగోపాల్, రేఖారాణి మంగళవారం శ్రీశైలం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మొత్తం 53 చీరలు, 10 పంచెలు అందజేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు పీ మార్కండేయ శాస్త్రి, పీఆర్ఓ టీ శ్రీనివాసరావు, పర్యవేక్షకులు కే అయ్యన్న, అమ్మవారి ఆలయ ఇన్ స్పెక్టర్ కే మల్లికార్జునులకు అందజేశారు. తర్వాత దాతకు రశీదు అందజేశారు. వేద పండితులు వేదాశీర్వచనంతో స్వామి అమ్మవారి శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.