అమరావతి : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ( Srisailam ) జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 42,486 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 843 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ 215. 80 టీఎంసీలు (TMC) కాగా ప్రస్తుతం 87.04 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఒడిశా (Odissa )లో రిజర్వాయర్ నుంచి నీటి విడుదల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదికి వరద ఉధృతి పెరిగింది. గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసి ఆయకట్టు రైతులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ బ్యారేజ్‌కు 40 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.