Srisailam | తెలంగాణ నుండి మోటార్ సైకిల్‌పై అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను శ్రీశైలం పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి మద్యం తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు శ్రీశైలం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, సిబ్బంది రఘునాథుడు, బాలకృష్ణ, మహేష్, శంకర్, అమర్నాథ్ రెడ్డి తదితరులు శ్రీశైలం దేవస్థానం టోల్ గేటు వద్ద తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో ఒక వ్యక్తి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న సంగతి పోలీసులు గుర్తించారు.
ఆయన్ను అదుపులోకి తీసుకోవడంతోపాటు అతనివద్ద నుంచి 70 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్‌పై జైలుకు పంపారు. పట్టుబడిన ముద్దాయి ఆకుల వంశీ అలియాస్ సన్నీ (19) నంద్యాల జిల్లా శ్రీశైలం మండల కేంద్రంలోని కొత్తపేట వాసి అని తేలింది. తెలంగాణ నుంచి తీసుకొస్తున్న 70డీకే డబుల్ కిక్ సుపీరియర్ విస్కీ బాటిళ్లు, డామినార్ మోటారు సైకిల్‌ను పోలీసులు జప్తు చేశారు.
Ola Electric Motorbike | వచ్చే ఏడాది ఓలా ఈవీ మోటారు సైకిల్.. తెగేసి చెప్పిన భవిష్ అగర్వాల్..!
Realme Narzo N61 | రియల్మీ నుంచి బడ్జెట్ ఫోన్ రియల్మీ నార్జో ఎన్61.. ఇవీ డీటెయిల్స్..!
Oppo K12x 5G | ఒప్పో నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ.. ఇవీ డీటెయిల్స్..!