Srisailam | జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రమే శ్రీశైలం అని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి అన్నారు. గురువారం ఉదయం క్షేత్రానికి వచ్చిన ఆయనకు కన్నడ భక్తులు ప్రత్యేక పూజలు చేసుకుని గురు ఆశీస్సులు పొందారు. అనంతరం క్షేత్ర పుర వీధుల్లో పల్లకిపై ఊరేగిస్తూ భజనలు చేశారు.
ఆలయ దర్శనానికి వచ్చిన పీఠాధిపతికి ఈవో పెద్దిరాజుతోపాటు అర్చకులు, వేదపండితులు బిల్వమాలధారణం చేసి ఘనంగా స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాలతోపాటు పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.