Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి రూ.3.46కోట్ల ఆదాయం సమకూరింది. హుండీలను గురువారం లెక్కించారు. గత 29 రోజుల్లో రూ.3,46,96,481 నగదు రూపేణ ఆదాయం లభించిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అదే సమయంలో హుండీలో 131 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారం. 5 కేజీల 50 గ్రాముల వెండి సైతం కానుకగా సమర్పించారని చెప్పారు. అలాగే, 2,321 యూఎస్ డాలర్లు, 57 మలేషియా రింగిట్స్, 20 కెనెడా డాలర్లు, 567 ఖతార్ రియాల్స్, 845 యూఏఈ దిరమ్స్, 15 ఆస్ట్రేలియా డాలర్లు, 30 ఈరోస్, 165 యూకే పౌండ్స్, 100 జాంబియా క్యాచాలు, 2000 కాంగో ఫ్రాంక్స్, 90 నేపాల్ రూపీస్, 20 శ్రీలంక రూపీస్ తదితర విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని ఆయన తెలిపారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కింపు చేపట్టినట్లు ఈవో వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఆర్ రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.