Srisailam | ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో, నంద్యాల జిల్లా ఇన్చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్, రాజంపేట అదనపు ఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, నంద్యాల అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, నంద్యాల అదనపు ఎస్పీ (ఏఆర్) చంద్రబాబు), కర్నూల్ అదనపు ఎస్పీ (ఏఆర్) కృష్ణమోహన్, డీఎస్పీలు శ్రీనివాస్, రవికుమార్, శ్రీనివాసరెడ్డి, ప్రమోద్ కుమార్, మహేంద్ర, శ్రీనివాస్ ఆచారి, హరిబాబు, అత్మకూర్ డీఎస్పీ రామంజి నాయక్ తదితర సీనియర్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఈ బందోబస్తులో సుమారు 2500 మంది పోలీసులు విధులు నిర్వర్తించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దేవస్థానం పరిధిలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించారు.
ఒక ఏసీపీ, 13 మంది డీఎస్పీలు, 80 మంది సీఐలు, 160 మంది ఎస్ఐలు బందోబస్తులో పాల్గొన్నారు. దేవస్థానం వద్ద క్యూలైన్ బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణకు 2,500 సివిల్ పోలీసులు, 120 మంది ఆర్ముడ్ పోలీసులు, వీవీఐపీలకు ఎస్కార్ట్ & ప్రొటెక్షన్ కోసం 200 మంది ఏపీఎస్పీ పోలీసులు, పోలీస్ పికెటింగ్‌లు+ హెల్ప్ డెస్క్‌ల కోసం ఒక ఎన్డీఆర్ఎఫ్ పార్టీని సహాయ చర్యలను నియమిమచారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని 800 సీసీ కెమెరాలను, ఎనిమిది డ్రోన్లను వినియోగించారు. 25 బ్లూ కోర్ట్స్‌ను ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం నియమించారు. ఇంకా బీడీ టీమ్స్, క్రైమ్ పార్టీలు, పోలీసు సేవాదళ్, ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పది రక్షక్ వెహికల్స్ వినియోగించారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన సిబ్బందిని ఆత్మకూర్ డీఎస్పీ రామంజి నాయక్, శ్రీశైలం సీఐలు ప్రసాదరావు, చంద్రబాబు అభినందించారు.