Srisailam | శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
శ్రీశైలం ఆలయంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఇ.చంద్రశేఖర్ రెడ్డిని ఇన్చార్జి ఈవోగా ఏపీ ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన పెద్దిరాజు డిప్యూటేషన్‌పై ఏడాదిగా శ్రీశైలం ఆలయ ఈవోగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన రెవెన్యూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. పెద్దిరాజుకు గతంలో ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దీంతో గత ఈవో లవన్న బదిలీ తర్వాత అప్పటి వైసీపీ ప్రభుత్వం పెద్దిరాజును ఈవోగా నియమించింది.
రెండు వారాల కిందటే పెద్దిరాజు సర్వీసు ముగిసింది. దీంతో అప్పుడే ఆయన స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్త ఈవోను నియమిస్తుందని అంతా భావించారు. కానీ ఆయన్ను కొనసాగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇంతలోనే అనూహ్యంగా ఆయన్ను బదిలీ చేసింది.