Srisailam | శ్రీశైల జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సోమవారం జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా 20,310 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36,491 క్కూసెక్కుల నీరు విడుదలైంది. దీంతో సోమవారం సాయంత్రానికి 44,853 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వచ్చి చేరడంతో జలాశయంలో నీటి నిల్వ 862 అడుగులుగా నమోదయ్యింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 862.20 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 112.96 టీఎంసీలు ఉన్నాయి.