హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : తిరుపతి శ్రీవెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పేల్చివేస్తామని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గురువారం వర్సిటీకి మెయిల్ వచ్చింది. సిబ్బంది ఎస్పీకి సమాచారం అందించారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు ఆధ్వర్యంలో పోలీసులు బాంబ్, డాగ్స్కాడ్తో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని తేల్చి ఫేక్ బెదిరింపుగా పేర్కొన్నారు.
కేరళ నుంచి మెయిల్ వచ్చిందని, రెండు నెలల క్రితం కూడా తమిళనాడు నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్టు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.