తిరుపతి : శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 132వ జయంతిని డిసెంబరు 17వ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు. ఈయన తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషి చేశారు. శ్రీమాన్ సుబ్రమణ్యశాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కారుగా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించారు. అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చారు.
శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 132వ జయంతి వేడుకల్లో భాగంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా ఉన్న శ్రీ సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహిస్తారు.