అన్నమాచార్య కళామందిరంలో వైభవంగా శ్రీ గోదాకల్యాణం
పవిత్ర ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది.
తిరుపతి : పవిత్ర ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 250 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు. ముందుగా శ్రీ గోదాదేవి(ఆండాళ్), శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను వేదికపై ఉంచి శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు.
వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్ర సంగీతం, నృత్యాల నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది. 
అన్నమాచార్య కళామందిరంలో ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు
టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 17 నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు శనివారం ముగిశాయి. తిరుపతికి చెందిన ప్రముఖ పండితులు చక్రవర్తి రంగనాథన్ తిరుప్పావై ప్రవచనాలు వినిపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

