అమరావతి : ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో సోమవారం ఉదయం గ్యాస్ లీకై (ONGC Gas leak ) చెలరేగిన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓఎన్జీసీ సాంకేతిక విభాగం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించక పోవడంతో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తరలి వచ్చింది.
బ్లో అవుట్ ప్రదేశానికి చేరుకుని కూలెంట్ ద్రవం ఉపయోగించి మంటలు అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఘటనకు సమీపంలో నివాసముంటున్న 5వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పార్లమెంట్ సభ్యుడు హరీశ్ మాధూర్ వెల్లడించారు. బాధితులకు అన్ని సౌకర్యాలు అందిస్తున్నామని వివరించారు.