Special Trains | దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో 170 ప్రత్యేక రైళ్లు నడపుతామని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తిరుపతి-చర్లపల్లి (07481) మధ్య నాలుగు రైళ్లు, సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు చర్లపల్లి- తిరుపతి (07482) మధ్య నాలుగు రైళ్లు నడపనున్నారు.
సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతి శుక్రవారం చర్లపల్లి-తిరుపతి (07011) మధ్య నాలుగు రైళ్లు, సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రతి శనివారం తిరుపతి నుంచి చర్లపల్లికి (07012) మధ్య నాలుగు రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు మల్కాజిగిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట స్టేషన్ల మీదుగా వెళ్లనుంది.
అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ప్రతి బుధవారం తిరుపతి-హిస్సార్ (07717) మధ్య 9 రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. హిస్సార్ నుంచి తిరుపతికి (07718) రైలు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారాల్లో నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, డోన్, కర్నూలు సిటీ, గద్వాల, మహబూబ్‌నగర్, జడ్చర్ల, కాచిగూడ, మల్కాజిగిరి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముడ్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బస్మట్, హింగోళి, వాసిం, అకోలా, షేగావ్, మల్కాపూర్, భుస్వాల్, జల్గావ్, ధరన్‌గావ్, అమల్నేర్, నందుర్బార్, ఉడ్నా, వడోదరా, రత్లామ్, మాండ్సోర్, నీమచ్, చిత్తౌర్‌ఘర్, భిల్వారా, బిజయ్ నగర్ నాసిర్బాద్, అజ్మీర్, కృష్ణాఘర్, పులేరా, రింగస్, సికర్, నవాల్‌ఘర్, ఝంజును, చిరావా, లోహార్, సదుల్పూర్ స్టేషన్ల మీదుగా వెళ్లనుంది.
నాందేడ్-ధర్మవరం (07189) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శుక్రవారాల్లో నడపనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 28వ తేదీ వరకు ధర్మవరం నుంచి నాందేడ్‌కు ఆదివారాల్లో నడిపిస్తున్నారు. ఈ రైలు ముడ్ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లి, కదిరి స్టేషన్ల మీదుగా ధర్మవరం వెళ్లనుంది.
సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రతి శుక్ర, ఆదివారాల్లో బెంగళూరు నుంచి బీదర్‌కు ప్రత్యేక రైలు (06530) నడపనున్నారు. బీదర్ నుంచి బెంగళూరుకు (06540) రైలును సెప్టెంబర్ 6 నుంచి 29వ తేదీ వరకు శని, సోమవారాల్లో నడిపించనున్నారు. యశ్వంత్‌పూర్-ధన్‌బాద్ (06563) ప్రత్యేక రైలును ఇవాల్టి నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు ప్రతి శనివారం నడిపించనున్నారు. ధన్‌బాద్ నుంచి యశ్వంత్‌పూర్ (06564) రైలును ఈ నెల 25వ తేద ఈనుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు నడిపిస్తున్నారు.