అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులను పట్టించుకోక నిర్వీర్యం చేసిందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి (Minister Anam Rannarayana Reddy) ఆరోపించారు. ముఖ్యంగా సోమశిల ప్రాజెక్టు (Somasila Project) గురించి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు విన్నవించినా నిర్లక్ష్యం చేసినందుకు తాను వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని స్పష్టం చేశారు.
శనివారం నెల్లూరు జడ్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, ఎమ్మెల్యేలతో కలసి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే, ఆ పనులను పూర్తి చేయడానికి ఎన్డీఏ (NDA) కూటమి సిద్ధంగా ఉందని వివరించారు. సోమశిలకు వరద వచ్చి సోమేశ్వర ఆలయం కొట్టుకుపోతే, జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
సోమశిల ప్రాజెక్ట్ హైలెవల్ కెనాల్ పనులను ఎందుకు నిలిపివేసిందో తెలుపాలని డిమాండ్ చేశారు . పోలవరాన్ని (Polavaram) త్వరలో పూర్తి చేసి ఏపీని సస్యశ్యామలం చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థలకు ఇంకా రెండున్నారేళ్లు సమయం ఉందని, రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తామని ఒక ప్రశ్నకు సమాదానమిచ్చారు. పెన్షన్ల పంపిణీ వలంటరీ వ్యవస్థ ఉంటేనే సాధ్యమవుతుందని జగన్ ప్రభుత్వంలో చెప్పారని, కూటమి ప్రభుత్వం వలంటరీ వ్యవస్థతో పనిలేకుండానే ఫించన్లు పంపిణీ చేస్తుందని స్పష్టం చేశారు.
Visaka MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తా .. మాజీ మంత్రి బొత్స ధీమా