అమరావతి : ఉమ్మడి విశాఖ జిల్లాలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Visaka MLC Election ) తాను విజయం సాధిస్తానని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana) ధీమాను వ్యక్తం చేశారు. శనివారం విశాఖ కార్పొరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈనెల 12న నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు.
పోలింగ్ వరకు తమ వ్యూహం ఎవరికి అంతు పట్టదని అన్నారు. విశాఖలో వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉందని అన్నారు. కూటమి ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన విజయాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. వైసీపీ(YCP) కి 620 పైగా ఓట్లు ఉన్నాయని, టీడీపీ(TDP) కి 200 ఓట్ల బలం మాత్రమే ఉందని తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు(Chandra Babu) ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కూటమికి ఈ ఎన్నికల్లో బలం లేకున్నా పోటీ చేస్తుందని, దొడ్డిదారిన ప్రలోభాలకు గురిచేసి గెలిచేందుకు కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలిస్తే కౌన్సిల్లో ప్రజా సమస్యలపై గొంతు విప్పుతారని అన్నారు.