JC Prabhakar Reddy | ఇసుక అక్రమ రవాణా చేస్తే ఒప్పుకునేదే లేదని టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నా బంధువు అయినా సరే.. నా మిత్రుడు అయినా సరే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాల్సిందేనని హెచ్చరించారు. నా కోసం జైలుకెళ్లొచ్చిన వాళ్లు.. నా వెంట ఉన్న వాళ్లకు న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. కానీ దయచేసి ఇసుక అక్రమ రవాణా మాత్రం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశారు.
ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి తన దగ్గర లిస్ట్ ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అందులో 40 మంది పేర్లు ఉన్నాయని అన్నారు. సోమవారం వరకు తనకు రిప్లై ఇచ్చి.. ఆ లిస్ట్ పంపించమంటే పంపిస్తానని చెప్పారు. ఎన్నికల్లో తనకోసం పనిచేసినందుకు రేషన్ స్టోర్లు, సారాయి దుకాణాలు ఇస్తే చాలా అని కొందరు అనుకుంటున్నారని తెలిసిందన్నారు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేసిన జేసీ.. మీకు నది మొత్తం ఇచ్చేయాలా ఏంటి అని ప్రశ్నించారు.
కొంతమంది ఇసుకను ఇష్టానుసారంగా తరలిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అలాంటి వాళ్ల టిప్పర్లు, ట్రాక్టర్ పట్టుకుని పోతే సంవత్సరం పాటు బయటకు రాదని హెచ్చరించారు. టిప్పర్లు, ట్రాక్టర్లను ఇసుక అక్రమ రవాణాకు అద్దెకు ఇవ్వద్దని ఈ సందర్భంగా యజమానులకు సూచించారు. తనతో కష్టపడిన వాళ్లకు ఏం చేయాలో.. ఏం చేయకూడదో తనకు తెలుసునని అన్నారు. వారికి 100 శాతం న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తనతో తిరిగిన ఎవర్నీ వదలిపెట్టనని అన్నారు. దయచేసి ఇసుక విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. నా బంధువు అయినా.. నా మిత్రుడు అయినా సరే.. నా శ్రేయోభిలాషి అయినా సరే.. నాకు ప్రాణాలు ఇచ్చినవాళ్లు అయినా సరే ఇసుక విషయంలో అక్రమాలు మానుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇసుక అక్రమ రవాణా అందరూ మానుకోవాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి
నా బంధువుల అయినా.. నా కోసం జైలుకెళ్లొచ్చిన వాళ్లైనా ఇసుక తవ్వకాలు, రవాణా ఆపేయాల్సిందే.
40 మంది ఇసుక రవాణా చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
వారందరికీ ఇదే లాస్ట్.. ఇంకోసారి ఇసుక రవాణా చేస్తే వాహనాలు సీజ్ చేయిస్తా.… pic.twitter.com/VGhoptD5YQ
— BIG TV Breaking News (@bigtvtelugu) August 10, 2024