Software Engineer | కారుకు మంటలు అంటుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ సజీవదహనం.. హత్యా లేకా ఆత్మహత్యా?
ఆంధ్రప్రదేశ్‌లోని (Andhrapradesh) తిరుపతిలో (Tirupati) దారుణం చోటుచేసుకున్నది. చంద్రగిరి మండలం గుంగుడుపల్లెలో దుండగులు కారుపై పెట్రోల్‌పోసి నిప్పంటించారు. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని (Andhrapradesh) తిరుపతిలో (Tirupati) దారుణం చోటుచేసుకున్నది. చంద్రగిరి మండలం గుంగుడుపల్లెలో దుండగులు కారుపై పెట్రోల్‌పోసి నిప్పంటించారు. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నంబర్‌ప్లేట్ ఆధారంగా మృతుడిని వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా (Nagaraju) గుర్తించారు. అతడు కర్ణాటకలోని (Karnataka) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా (Software Engineer) పనిచేస్తున్నాడని చెప్పారు.
తిరుపతి నుంచి బ్రాహ్మణపల్లి వెళ్తుండగా.. మార్గమధ్యలో గంగుడుపల్లె సమీపంలో మంటల్లో కారు దగ్ధమైంది. దీంతో అతడు సజీవదహనమయ్యాడని చెప్పారు. ఘటనా స్థలంలో బంగారు గొలుసు, చెప్పులు లభించాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

