నెల్లూరు: ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) నెల్లూరు (Nellore) జిల్లా కావలి రైల్వేస్టేషన్లో (Kavali Railway station) రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ (Rajdhani express) రైలులోని బీ-5 బోగీ వద్ద పొగలు వచ్చాయి. దీంతో కావలి వద్ద 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే బ్రేక్ ఫెయిల్ (Brakes fail) కావడంతోనే పొగలు వచ్చినట్లు కావలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ శ్రీహరి రావు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పారు. మరమ్మతుల తర్వాత రైలు అక్కడి నుంచి వెళ్లిపోయింది.