TTD | ఉత్తరప్రదేశ్ కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం : టీటీడీ సన్నహాలు
TTD | ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళా కార్యక్రమంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటుకు టీటీడీ నిశ్చయించింది.
తిరుమల : ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh ) రాష్ట్రంలోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళా (Kumbh Mela) కార్యక్రమంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటుకు టీటీడీ నిశ్చయించింది. దేశవ్యాప్తంగా హిందు ధర్మ ప్రచారం కోసం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు.

ఇందులో భాగంగా టీటీడీ జేఈవో గౌతమి ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్‌ను శనివారం లాంఛనంగా కలిశారు. ప్రయాగరాజ్‌లో ఆలయం ఏర్పాటుకు ఆరో సెక్టార్లో 2.50 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించింది. ఈ సందర్భంగా జేఈవో ఆ స్థలాన్ని టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.
ముఖ్యంగా కుంభమేళాకు తరలివచ్చే ఉత్తరాది భక్తులను దృష్టిలో ఉంచుకుని నమూనా ఆలయం వద్ద ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్థలాన్ని పరిశీలించిన టీటీడీ బృందంలో హెచ్ డీపీపీ సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి, స్థానిక అధికారులు ఉన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

