AP BRS Party | తుఫాను బాధిత రైతులను ఆదుకోవాలి : ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
AP BRS Party | మిగ్జాం తుఫాను ప్రభావంతో అతలాకుతలమై తీవ్రంగా నష్టపోయిన ఏపీ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చేతికొచ్చిన ధాన్యం, అరటి, జొన్న పంటలు నీట మునిగి వేలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రకృతి విప్పత్తులు మిగిల్చిన నష్టంతో రైతులు కుదేలవుతున్నారన్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా తడిసిన, నేలకొరిగిన ధాన్యాన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో కొనుగోలు చేసి వారిని ఆడుకోవాలని తోట విజ్ఞప్తి చేశారు. కుండపోత వర్షం, ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయన్నారు.
దీంతో గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి గ్రామీణ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని వాపోయారు. పూర్తిగా జలమయమైన లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించి ప్రభుత్వం వారిని అన్నీ విధాలుగా ఆదుకోవాలని కోరారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలని తోట పిలుపునిచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!