Srisailam | శ్రీశైలంలో శివస్వాముల ఆందోళన.. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన శివస్వాములు దేవస్థానం ఏర్పాట్లు దర్శన విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యూలైన్లలో ఆందోళనకు దిగారు. క్యూలైన్లలో కిక్కిరిసిపోయిన శివస్వాములు సహనం కోల్పోయి ఆలయ ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన శివస్వాములు దేవస్థానం ఏర్పాట్లు దర్శన విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యూలైన్లలో ఆందోళనకు దిగారు. బుధవారం క్షేత్రానికి వచ్చిన స్వాములు సుమారు 5 గంటలకు పైగా క్యూలైన్లో వేచి ఉన్నప్పటికీ స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించకపోవడంతోపాటు కనీసం అల్పాహారం, మంచి నీరు కూడా అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలైన్లలో కిక్కిరిసిపోయిన శివస్వాములు సహనం కోల్పోయి ఆలయ ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండు రోజుల్లో మెదలవుతున్నందున స్పర్శ దర్శనం చేసుకునేందుకు వచ్చే యాత్రికుల రద్దీ గణనీయంగా పెరిగిపోయింది. అదే విధంగా దేవస్థానం అధికారులు సామాన్య భక్తుల దర్శనాలను నిర్లక్ష్యం చేస్తూ ఆర్జిత వీఐపీ దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం సమంజసం కాదని శివస్వాములు ఆందోళన చేయడంతో సహ యాత్రికులు కూడా అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
శ్రీశైల ఆలయ ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించుటకు తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులు కూడా సహకరించాలని కోరుతున్నారు. అదే విధంగా సామూహిక అభిషేక సేవాకర్తలు, బ్రేక్ దర్శనాల కోసం కూడా అధిక సమయం పడుతుందని అన్నారు. పాదయాత్రలు చేసి వచ్చే శివస్వాములకు ప్రాధాన్యత కల్పిస్తూ వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఈవో తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

