Srisailam | ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని కార్తీక మాస శివ చతుసప్తాహ భజనలను ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం శ్రావణ, కార్తీక మాసంలో శివ చతుసప్తాహ భజనలను నిర్వహిస్తోంది. పవిత్ర అఖండ భజనలను కార్తీక మాసాంతం నిర్వహించనున్నారు.
ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అర్చక స్వాములు సంకల్పాన్ని పఠించి భజనలు నిర్విఘ్నంగా జరిగేందుకు గణపతి పూజ జరిపించారు. అనంతరం చండీశ్వర స్వామికి విశేష పూజలు జరిపించి శివ ప్రణవ పంచాక్షరి నామ భజనలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలుకు చెందిన రెండు భజన బృందాలు, కర్ణాటకకు చెందిన నాలుగు భజన బృందాలకు అవకాశం కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీశైల దేవస్థానానికి పచ్చళ్ల విరాళం
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణకు సుమారు 2000 కేజీల పచ్చళ్లు విరాళం అందజేశారు. ఇబ్రహీంపట్నానికి చెందిన ఎస్ సత్యనారాయణ, బెంగుళూరుకు చెందిన సుదర్శన్ చైతన్య లు పచ్చళ్లను ఈవో చంద్రశేఖర్ రెడ్డి కి విరాళంగా ఇచ్చారు. శనివారం అన్నదాన భవనంలో మూడు లక్షల విలువ గల మామిడి నిమ్మకాయ పచ్చళ్ళను అందించారు. ఈ పచ్చళ్లను అన్న ప్రసాద విత్తనాలు భక్తులకు వడ్డించాలని దాతలు కోరారు.