Srisailam | శ్రీశైలం : శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఐదవ రోజైన సోమవారం భ్రమరాంబాదేవి స్కందమాతగా భక్తులను అనుగ్రహించింది. స్కందమాతగా చతుర్బుజాలు కలిగి పద్మం, కమలం, అభయహస్తం, ఒడిలో బాల షణ్ముఖుడైన కుమారస్వామి (స్కందుడు) ని ధరించి భక్తులకు దర్శనమివ్వగా శేషవాహనంపై శ్రీశైల మల్లన్నతో కలిసి భక్తులను కరుణించింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శేషవాహనం అధిష్టించిన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారికి ప్రధాన అర్చకులు వేదపండితులు వాహన సేవను వైభవంగా జరిపించారు.
అలంకీకృతమైన స్కందమాత మల్లికార్జున స్వామి అమ్మవార్లను భక్తులు కనువిందుగా దర్శించుకున్నారు. గ్రామోత్సవంలో భాగంగా ఉత్సవ మూర్తులు శేషవాహనంపై గంగాధర మండపం నుంచి మొదులుకొని నంది మండపం మీదుగా బయలు వీరభద్రస్వామి వరకు విహరిస్తూ భక్తాదులను కరుణించారు. గ్రామోత్సవంలో నాదస్వరం, కేరళ చండీ మేళం, కొముకోయ నృత్యం, థయ్యం, విళక్కు, (సంప్రదాయ నృత్యం), స్వాగత నృత్యాలు, కోలాటం, రాజభటుల గ్రామోత్సవంలో నాదస్వరం, కేరళ చండీ మేళం, కొముకోయ నృత్యం, థయ్యం, విళక్కు, (సంప్రదాయ నృత్యం), స్వాగత నృత్యాలు, కోలాటం, రాజభటుల వేషాలు, జానపద పగటి వేషాలు, అశ్వ ప్రదర్శన, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, త్రిశూలం, జేగంట, కంచుడోలు, కొమ్ము, తాళాలు, చెక్కభజన, అమ్మవారి వేషం, తప్పెట చిందు, డోలు విన్యాసం, వీరభద్రడోలుకుణిత కన్నడ జానపదాలు మొదలగు వివిధ రకాల విన్యాసాలతో ఆద్యంతం కనులపండువగా సాగింది . ఉత్సవం తరువాత సువాసిని పూజ, కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు తీర్థప్రసాద వితరణ, ఆదిదంపతులకు ఆస్థానసేవ జరిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, పీఆర్ వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్ కుమార్, అయ్యన్న, హర్యాయాయక్ ఉన్నారు.
రేపు కాత్యాయని అలంకారంలో…
శరన్నవరాత్రుల్లో ఆరవరోజు మంగళవారం భ్రమరాంబాదేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమివ్వగా.. మల్లికార్జున స్వామివారికి హంసవాహనసేవ నిర్వహించనున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.