అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వల్ల దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు(Heavy rain ) కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు(Meteorological Department) వెల్లడించారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని , మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
రాష్ట్రంలోని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, సహా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. చేశారు. అల్పపీడనం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకుని చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.