TTD | శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మరో 8 ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు : టీటీడీ
TTD | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ మరో 8 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు(Brahmotsavam) వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ (TTD ) మరో 8 ప్రథమ చికిత్స కేంద్రాలను ( First Aid Centers ) ఏర్పాటు చేయనుంది. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని టీటీడీ అధికారులు వివరించారు.
ఇప్పటికే తిరుమల(Tirumala) , తిరుపతిలలో శాశ్వతంగా ఆరు డిస్పెన్సరీలు, ఆరు ప్రథమ చికిత్స కేంద్రాలలో భక్తులు, ఉద్యోగులు, స్థానికులకు టీటీడీ వైద్య సేవలు అందిస్తోందని అన్నారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో రెండు, రాంబగీచ అతిథి గృహాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము, శిలా తోరణం, బాట గంగమ్మ ఆలయము, పాపానాశనం, 7వ మైలు వద్ద ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రముఖ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, మందులు, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్ లు సిద్ధం చేసుకుంటున్నామని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

