తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 20న దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని(Diwali Asthanam) శాస్త్రోక్తంగా నిర్వహించనున్నదని టీటీడీ అధికారులు(TTD officials) వెల్లడించారు. ఉదయం 7 నుంచి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో ఆస్థానం జరుగుతుందన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబరు 20న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేసిందని వెల్లడించారు. తోమాల, అర్చన సేవలను అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారని తెలిపారు.