అమరావతి : విశాఖలోని (Visaka) అగనంపూడి టోల్గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) దంపతులు మృతి చెందారు. టిప్పర్ ఢీకొని బైక్పై ప్రయాణిస్తున్న గొర్లె మన్మథరావు, అరుణకుమారి అక్కడికక్కడే మృతి చెందారు. టిప్పర్ (Tipper) డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడపడం వల్లే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు టిప్పర్ను స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.