అమరావతి : ఏపీలోని విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. విజయవాడలోని మార్టూరు మండలం డేగరమూడి సమీపంలో లారీ(Lorry) బైక్ను ఢీ కొట్టింది. బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.