అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత ఎన్నికల సంఘం(Election Commission) తీవ్రంగా స్పందించింది . ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) జవాహర్రెడ్డి, రాష్ట్ర డీజీపీ హారీష్కుమార్(DGP Harish kumar) కు సమన్లు (EC summons) జారీ చేసింది.
పల్నాడు, చంద్రగిరి, తిరుపతి,తాడిపత్రి, నంద్యాల జిల్లాలో జరిగిన హింసను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని ప్రశ్నిస్తూ శుక్రవారం వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది . పోలింగ్ జరిగిన రెండు రోజులు కావస్తున్న రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అల్లర్లు అదుపులోకి తీసుకురాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.