అమరావతి : సికింద్రాబాద్ (Secundrabad) నుంచి రేపల్లె బయలు దేరిన ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది . మంగళవారం సిక్రిందాబాద్ నుంచి బయలు దేరిన రేపల్లె ఎక్స్‌ప్రెస్ (Repalle Express) లో గుంటూరు బైపాస్ వద్ద పెద్ద శబ్దం వచ్చి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే స్పందించి బోగిలో ఉన్న చెయిన్‌ను లాగి రైలును నిలిపివేశారు. రైలు డ్రైవర్ వచ్చి పరీక్షించి సాంకేతిక లోపం (Technical fault) తో ఈ ఘటన జరిగిందని దృవీకరించి సమస్యను పరిష్కరించారు. ఈ కారణంగా గంటపాటు రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.