CM Jagan : త్వరలో రెండో విడుత రైతు భరోసా నిధులు విడుదల : సమీక్షలో జగన్
CM Jagan review : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం స్పందనపై వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సందర్భంగా రైతు భరోసాకు సంబంధించి...

(CM Jagan review) అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం స్పందనపై వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సందర్భంగా రైతు భరోసాకు సంబంధించి కలెక్టర్లు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే రెండో విడుత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు గుడ్ న్యూస్ చెప్పారు. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇచ్చామని.. వారికి పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పంట కొనుగోలు జరగాలంటే ఇ– క్రాపింగ్ చేయాలని, ఇ– క్రాపింగ్‌పైన కలెక్టర్లు, జాయంట్ కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.
ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మెటీరియల్ కాంపొనెంట్ వినియోగంపై ఫోకస్ పెట్టాలన్నారు. కృష్ణా, తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాలు గ్రామ సచివాలయాల నిర్మాణాల విషయంలో వెనకబడి ఉన్నాయని, వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల భవనాలను కూడా పూర్తిచేయాలన్నారు. కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఈ పనులపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.
వైయస్సార్ హెల్త్ క్లినిక్స్‌పైనా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సీఎం జగన్ సూచించారు. గ్రామాల్లో డిజిటిల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామని.. తొలి విడతలో 4,314 లైబ్రరీలను నిర్మించనున్నట్లు తెలిపారు. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లు వీటిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. అగ్రికల్చర్ అడ్వైయిజరీ మీటింగ్స్ కచ్చితంగా జరిగేలా చూడాలని జగర్ ఆదేశించారు. 100 ఏండ్ల తర్వాత భూముల సర్వే చేపడుతున్నామని, 2023 జూన్‌కల్లా పూర్తయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్లకు సూచించారు. నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై కూడా సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ పథకం వల్ల 47.4 లక్షల మంది లబ్ధి పొందుతారని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
దేవరగట్టు కర్రల యుద్ధంలో ఉద్దేశపూర్వక దాడులు : 14 మంది అరెస్ట్
అధికారం దక్కలేదన్న అక్కసుతోనే దాడులు : జగన్
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో.. చేసి చూపిస్తా: చంద్రబాబు
డిసెంబర్ నుంచి టీవీ వీక్షణం.. చాలా కాస్ట్లీ గురూ!
ఇది ప్రపంచంలోనే అతిచిన్న గేమ్ కన్సోల్..!
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

