Tirumala | డిసెంబర్ 4న తిరుమలలో సహస్ర దీపాలంకరణ సేవ, పౌర్ణమి గరుడసేవ రద్దు
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4న సాలకట్ల కార్తిక పర్వదీపోత్సవం సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవ , పౌర్ణమి గరుడసేవ రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4న సాలకట్ల కార్తిక పర్వదీపోత్సవం సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవ (Sahasra Deepalankaran Seva) , పౌర్ణమి గరుడసేవ రద్దు (Pournami Garuda Seva) చేసినట్లు టీటీడీ అధికారులు ( TTD Officials ) వెల్లడించారు.
4న కార్తిక పౌర్ణమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన తరువాత దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు . సాయంత్రం దీపాలను నేతి వత్తులతో వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తామన్నారు.
అనంతరం గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం వద్ద దీపాల ఏర్పాటు ఉంటుందన్నారు. అదేవిధంగా సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం వద్ద దీపాలను అర్చకులు వెలిగిస్తారన్నారు.
క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద కూడా దీపాల ఏర్పాటు ఉంటుందన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

