వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లాలో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు (RTC Bus) పులివెందుల సమీపంలో అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది. దీంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఉన్నవారిని రక్షించి దవాఖానకు తరలించారు.
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున కదిరి నుంచి పులిందుల వైపు వెళ్తుండగా బస్సు బోల్తా పడిందని చెప్పారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.