మంగళవారం 11 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 09, 2020 , 13:55:21

ఏపీలో యాప్‌ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లు

ఏపీలో యాప్‌ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లు

అమరావతి:  కరోనా వ్యాప్తి జరుగకుండా ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ సంస్థ నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈనెల 20 నుంచి ప్రథమ్‌ యాప్‌ ద్వారా  ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు జారీ చేయనున్నామని ఏపీ ఆర్టీసీ సంస్థ ఎండీ తెలిపారు.  ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని  19డిపోల పరిధిలో యాప్‌ ద్వారా టికెట్లు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

విజయవాడ, విశాఖ, తిరుపతి, నెల్లూరు -1, గుంటూరు -1, -2,  కర్నూలు-1, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అమలాపుపరం, రావులపాలెం, చిత్తూరు-2 డిపోల నుంచి యా‌ప్‌ ద్వారా టికెట్లు జారీ చేయాలని  ఈడీలకు, ఆర్టీసీ ఆర్‌ఎంలకు ఆదేశించారు. కరానా వ్యాపించకుండా కండక్టర్లు, డ్రైవర్లు ప్రత్యేక మొబైల్‌ సమకూర్చుకోవాలని సూచించారు. సూచించిన  ప్రమాణాల మేరకు స్మార్ట్‌ ఫోన్లు సమకూర్చుకోవాలని అన్నారు.

సిబ్బందికి యాప్‌ సహా అవసరమైన సాప్ట్‌వేర్‌ ఆర్టీసీ అందిస్తుందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎండీ ఆదేశాలలు జారీ చేశారు. . 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo