తిరుమల : దుబాయ్ లో నివాసం ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ ఎం. హనుమంత కుమార్ శుక్రవారం టీటీడీ కి రూ. కోటి విరాళంగా అందించి స్వామివారిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు ఈరోజు తిరుమల లోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి డీడీని అందజేశారు. టీటీడీ అభీష్టం మేరకు ఈ సొమ్ము ఏ ట్రస్ట్ కైనా జమచేసుకోవాలని దాత కోరారు.
అదేవిధంగా టీటీడీ గో సంరక్షణ ట్రస్ట్ కు సికింద్రాబాద్ కు చెందిన శ్రీ పద్మావతి సొల్యూషన్స్ అధినేత శ్రీధర్ శుక్రవారం పదిలక్షల వెయ్యి నూట పదహారును విరాళంగా అందించారు.