తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల(Tirumala) వేంకటేశ్వరస్వామికి విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ (RS Brothers) మేనేజింగ్ డైరెక్టర్లు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాద రావు,మాలతీ లక్ష్మీ కుమారిలు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.3.70 కోట్లు విరాళంగా అందజేశారు.ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయం లోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య(AEO) చౌదరికి దాతలు విరాళం చెక్కును అందజేశారు.
టీటీడీకి టాటా రవాణా వాహనం విరాళం
టీటీడీకి రూ.10 లక్షల విలువైన టాటా యోధ 1700 బిఎస్ విఐ రవాణా వాహనాన్ని(Vehicel) పలమనేరుకు చెందిన రవీంద్రారెడ్డి అందజేశారు.ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి పూజలు నిర్వహించి, తాళాలను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.ఈ కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్యే గోవిందప్ప, తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.