అమరావతి : నెల్లూరు జిల్లాలో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. జిల్లాలోని మాగుంట లేఅవుట్ వద్ద ప్రత్యేక పోలీసు అధికారులు నిర్వహించిన వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందుల్లో తారు వాహనాన్ని తనిఖీ చేయగా రూ . 2౩ లక్షల విలువ గల 18 వేల అక్రమ మద్యం సీసాలను పట్టుకున్నారు. గోవా నుంచి మద్యం తీసుకువచ్చి లేబుళ్లు అతికించి అధిక ధరలకు విక్రయిస్తున్న 8 మందిని పట్టుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలకు చెందిన ఇద్దరు సూపర్ వైజర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
తారు ట్యాంకర్ వాహనం ద్వారా పోలీసుల కళ్లుగప్పి మద్యం తరలిస్తున్నారు. నెల్లూరు నుంచి మైపాడు సముద్ర తీరం వరకు తీసుకెళ్లి నిలువ చేస్తున్నారని, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని నెల్లూరు ఎస్పీ విజయరామారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. తారు రోడ్డు నిర్మించే వాహనాన్ని తనిఖీ చేయారనే ఉద్దేశ్యంతో అక్రమ మద్యం సరఫరా చేస్తున్నారని తెలిపారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి మద్యం పట్టుకున్నారని తెలిపారు.