తిరుమల: కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంట్లో భాగంగా నిన్న 37,216 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 22,009 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ. 2. 72 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.