అమరావతి : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళ అత్యాచారం, హత్యకు గురైన ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. తెనాలి ఆస్పత్రిలో మృతురాలు తిరుపతమ్మ కుటుంబాన్ని మంత్రి నాగార్జున, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు సుచరిత, రామకృష్ణ రెడ్డి పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం అందజేస్తామని మంత్రి ప్రకటించారు.
మృతురాలి ఇద్దరు పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ కుటుంబానికి స్థలంతో పాటు ఇళ్లు కట్టించి ఇస్తామని మంత్రి తెలిపారు. కాగా దుగ్గిరాల ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందని ఆయన వెల్లడించారు. గ్యాంగ్ రేప్ జరగలేదని వివరించారు. కోరిక తీర్చలేదని సాయి ఆమె చీరనే మెడకు బిగించి శివసత్య సాయిరాం అనే నిందితుడు చంపివేశాడని పేర్కొన్నారు.