కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేవీపల్లి మండలం మఠంపల్లి దగ్గర ఎదురెదురుగా వచ్చిన తుఫాన్ వాహనం, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తుఫాన్ వాహనంలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమ్తిం తిరుపతిలోని రుయా అసుపత్రికి తరలించారు. బాధితులు తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతులంతా కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులుగా పోలీసులు గుర్తించారు.