అమరావతి : అయోధ్య దర్శనానికి (Ayodya Temple) వెళ్తున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లావాసులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జిల్లాలోని కోటబొమ్మాళి, పలాస, బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన కొందరు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు బయలు దేరారు. వారణాసి నుంచి అయోధ్యకు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం జౌన్పూర్లో ప్రమాదానికి గురైంది. దీంతో ఆ వాహనంలో ఉన్న 16 మందికి గాయాలు కాగా వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా వాసి, కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్నాయుడు బాధితులను ఫోన్లో పరామర్శించారు. జౌన్పూర్ కలెక్టర్, వారణాసి విమానాశ్రయ అధికారులు, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.