అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road Accident) ముగ్గురు మృతి చెందారు. మార్టూరు నుంచి చిలకలూరిపేట, పర్చూరు మీదుగా గుంటూరు వెళ్తుండగా శనివారం తిమ్మరాజుపాలెం వద్ద గ్రానైట్ పలకల ( Granite Slabs) లోడుతో వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి తిమ్మరాజుపాలెం వద్ద బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో గ్రానైట్ పలకలు మీదపడి మార్టూర్కు చెందిన పాలపర్తి శ్రీను, తాళ్లూరి ప్రభుదాస్, నూతనపాడుకు చెందిన తమ్మూలూరి సురేంద్ర మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్రేన్ సహాయంతో పలకను తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.